అందుకే చంద్రబాబు ఇంటిపై డ్రోన్ వినియోగించాం.. మంత్రి అనిల్

రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు, టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తన ఇల్లు మునిగిపోతుందనే విషయం బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చంద్రబాబు ఆరాటపడుతున్నారా? అని అనిల్ కుమార్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: August 16, 2019, 2:28 PM IST
అందుకే చంద్రబాబు ఇంటిపై డ్రోన్ వినియోగించాం.. మంత్రి అనిల్
చంద్రబాబు నివాసం, కృష్ణానది వరద
  • Share this:
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఇంటిపై డ్రోన్ వినియోగం పెద్ద దుమారం రేపింది. తన భద్రతనే ప్రశ్నార్థకం చేస్తారా అంటూ మాజీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగారు. అయితే, కృష్ణానది ఒడ్డున చంద్రబాబు ఇంటి సమీపంలో డ్రోన్ వినియోగానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ అనుమతితోనే డ్రోన్‌ను వినియోగించామని అనిల్ చెప్పారు. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోంది. ఈ క్రమంలో కరకట్ట మీద ఉండే ప్రజల రక్షణ బాధ్యత ప్రభుత్వానికి ఉందని, అందుకే, వరద పరిస్థితిని అంచనా వేసేందుకు తాము డ్రోన్‌ను వినియోగించామని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.

ప్రకాశం బ్యారేజీకి మరింతగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 7లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గంటగంటకూ నీటిమట్టం పెరుగుతోంది. వరద పరిస్థితిపై అంచనా కోసం డ్రోన్లు వినియోగిస్తున్నాం. గత మూడు రోజులుగా డ్రోన్లు వినియోగిస్తున్నాం. ఇరిగేషన్ శాఖ అనుమతి, ఆదేశాలతోనే డ్రోన్లు వాడుతున్నాం.

అనిల్ కుమార్ యాదవ్, ఏపీ మంత్రి


రాజకీయ పబ్బంకోసం చంద్రబాబు, టీడీపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కరకట్టమీద ఉన్న ఇల్లు నాది కాదని చంద్రబాబు అన్నారు. లింగమనేని రమేష్‌ కూడా అన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. తన ఇల్లు మునిగిపోతుందనే విషయం బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చంద్రబాబు ఆరాటపడుతున్నారా? అని అనిల్ కుమార్ ప్రశ్నించారు. వరద వస్తే చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందని ఎప్పుడో చెప్పామని, ఇప్పుడు ఇసుకబస్తాలు వేసి ఆనీరు పూర్తిగా ఇంటిలోకి రానీయకుండా అష్టకష్టాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో వరద వచ్చి ఉంటే, తన ఇల్లు మునిగిపోకుండా రైతులకు నీరు ఇవ్వడం మాని, చంద్రబాబు గేట్లు ఎత్తివేయించేవారని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
First published: August 16, 2019, 2:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading