చంద్రబాబు కూడా ప్రభుత్వ సొమ్మును దాచిపెట్టారు... ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు ఆశీస్సులతోనే కోడెల అసెంబ్లీలో ఫర్నిచర్ దొంగతనానికి పాల్పడ్డారన్నారు.

news18-telugu
Updated: August 23, 2019, 4:11 PM IST
చంద్రబాబు కూడా ప్రభుత్వ సొమ్మును దాచిపెట్టారు... ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
చంద్రబాబు ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి అనిల్ కుమార్. వరదల పై చంద్రబాబు మాట్లాడతారు అనుకుంటే రిజర్వాయర్ లో కట్టుకున్న తన ఇళ్లు మునిగిందని చెప్పుకొచ్చారంటూ ఎద్దేవా చేశారు. వరదలు ప్రకృతి విపత్తు కాదు మానవ విపత్తు అంటూ... ఇక్కడా కూడా హైటెక్ వ్యవహారాన్ని వదిలిపెట్టలేదని విమర్శలు చేశారు.తన ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్ట్ కూడా నిండకపోవడంతో ఆయన కరువు నాయకుడని ప్రజలకు తెలిసిపోయిందన్నారు.
రాయలసీమకు శ్రీశైలం నీళ్లు తరలించడాన్ని బాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపణలు చేశారు. కృష్ణా డెల్టా రైతులకు ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు రావడం బాబుకు ఇష్టం లేదన్నారు. చంద్రబాబు నీచ రాజకీయానికి పాల్పడుతున్నారని మంత్రి అనిల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఆశీస్సులతోనే కోడెల అసెంబ్లీలో ఫర్నిచర్ దొంగతనానికి పాల్పడ్డారన్నారు. బాబు కూడా ప్రభుత్వ సొమ్మును కోడెల మాదిరిగా చాలా చోట్ల దాచి పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దొంగల ముఠా వ్యవహారం బయటపడకుండా చంద్రబాబు ప్రెస్ మీట్ నాటకం ఆడారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు తనకు ఎందుకు ఓట్లు వేయలేదో సమీక్ష చేసుకుంటే మంచిదని హితవు పలికారు అనిల్ కుమార్. కనీసం శేష జీవితంలో చంద్రబాబు కొంచెమైనా మరానని చెప్పుకోవాలన్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>