కమలం రేకులు కప్పుకున్న జగన్... నారా లోకేశ్ కౌంటర్

ఏపీలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు, టీడీపీ నేతలు తప్ప ప్రజలెవరు ఆరోపించడం లేదన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు.

news18-telugu
Updated: April 18, 2019, 5:26 PM IST
కమలం రేకులు కప్పుకున్న జగన్... నారా లోకేశ్ కౌంటర్
నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: April 18, 2019, 5:26 PM IST
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేశ్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు, టీడీపీ నేతలు తప్ప ప్రజలెవరు ఆరోపించడం లేదని వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్‌గా ట్విట్టర్‌లో స్పందించారు ఏపీ మంత్రి నారా లోకేశ్. తనకు అనుకూలంగా జరిగితే అంతా సవ్యంగా జరిగిందని... లేదంటే అక్రమం అని వాదించేవాళ్లు స్వార్థపరులు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మీరు లోటస్ రక్షణలో ఉన్నారంటూ... పరోక్షంగా జగన్ బీజేపీ రక్షణలో ఉన్నారంటూ సెటైర్లు వేశారు. కమలం రేకులు కప్పుకున్న జగన్ కళ్లకు ఏపీలో ఎన్నికల వేళ ప్రజలు పడిన ఇబ్బందులను చూపించడం కోసమే ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నానంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఏపీలో ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు మొరాయించడం, హింస జరగడంపై టీడీపీ తొలి నుంచి ఈసీ తీరును తప్పుబడుతోంది. ఈసీ కేంద్రం చెప్పినట్టుగా ఉంటోందని... వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నేరుగా విమర్శలు చేస్తూ వస్తోంది. ఎన్నికలు నిర్వహించడంలో ఈసీ దారుణంగా విఫలమైందని మండిపడింది. ఈ క్రమంలో జగన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా నారా లోకేశ్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరి... దీనిపై వైసీపీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి
First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...