హోమ్ /వార్తలు /రాజకీయం /

వెంకయ్య మెచ్చుకున్నారు... చంద్రబాబు భ్రష్టు పట్టించారన్న ఏపీ మంత్రి

వెంకయ్య మెచ్చుకున్నారు... చంద్రబాబు భ్రష్టు పట్టించారన్న ఏపీ మంత్రి

ఏపీ మంత్రి ఆళ్ల నాని(Twitter)

ఏపీ మంత్రి ఆళ్ల నాని(Twitter)

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుపై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు.

చంద్రబాబు అండ్ కో కరోనా విపత్తును తమను అనుకూలంగా మార్చుకోవడం హేయమైన చర్య అని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. తన అనుభవాన్ని విపత్తుల సమయంలో సలహాలు సూచనలు ఇవ్వాలి గాని ఈ విధంగా విమర్శలు చేయడం చంద్రబాబుకు మంచిది కాదని ఆళ్ల నాని అన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం పాలైనా ఆయనలో మార్పు రాలేదని విమర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వయంగా రాష్ట్రంలో చేస్తున్న పనులకు అభినందించారని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుపై అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆళ్ల నాని మండిపడ్డారు.

ప్రతి చిన్న విషయాన్నీ ఎన్నికలకు ముడిపెట్టి మాట్లాడటం కరెక్టు కాదని ఆళ్ల నాని అన్నారు. రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనల్లో వున్నారని... వారిని ఇంకా భయపెట్టకండని సూచించారు. చంద్రబాబునాయుడు పరిపాలించిన 5ఏళ్ళల్లో వైద్య రంగాన్ని బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్రానికి కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది అని తెలియగానే ముందస్తు జాగ్రత్తలు చేపట్టామన్న ఆళ్ల నాని... ప్రతి చిన్న విషయంలో కూడా సీఎం జగన్ సమీక్షించి అధికారులకు వివరిస్తూ ముందుకు వెళ్తున్నారని వివరించారు.

అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో తక్కువ కేసులు నమోదు కావటమే తమ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం 7ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. మరో 12 ల్యాబ్ లు ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు. రోజుకి 12,500 టెస్టుల కెపాసిటీ పెంచుకోబోతున్నామని అన్నారు. జాతీయ పేపర్స్, చానెల్స్ రాష్ట్రంలో కరోనాకి సంబంధించి అభినందిస్తుంటే చంద్రబాబుకు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

First published:

Tags: Alla Nani, Andhra Pradesh, Chandrababu naidu, Coronavirus, Tdp, Ysrcp

ఉత్తమ కథలు