Home /News /politics /

AP MINISTER ADIMOOLAPU SURESH NAME IN YSR RYTHU BHAROSA SCHEME LIST IN PRAKASAM DISTRICT AK

వైఎస్ఆర్ రైతు భరోసా పథకం... జాబితాలో ఏపీ మంత్రి

ఆదిమూలపు సురేష్

ఆదిమూలపు సురేష్

ఏపీలో అమలు కానున్న వైఎస్ఆర్ రైతు భరోసా లబ్దిదారుల జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేశ్ పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది.

    తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు తరహాలోనే ఏపీలో అమలు చేయబోయే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం లబ్దిదారుల జాబితాలో ఏపీ మంత్రి పేరు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఏపీ విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఈ పథకం లబ్దిదారుల జాబితాలో పొందుపర్చారు అధికారులు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గ్రామంలో ఖాతా నెంబర్ 1881లో మంత్రిని అర్హుడిగా చేర్చారు. ఐదెకరాలకు మంచి పోలం ఉండటంతో పాటు ఆదాయపు పన్ను కట్టేవారు ఈ పథకం ద్వారా లబ్ది పొందేందుకు అనర్హులు అనే నిబంధనలు ఉన్నాయి.

    Ap latest news, ysr rythu bharosa scheme, ap cm ys jagan mohan reddy, ap minister adimulapu suresh, minister adimulapu suresh name in ysr rythu bharosa scheme, prakasam district, ysrcp, ycp politics, ap news, ap politics, ఏపీ న్యూస్, వైఎస్ఆర్ రైతు భరోసా, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, రైతు భరోసా పథకంలో ఏపీ మంత్రి పేరు, ప్రకాశం జిల్లా, వైసీపీ
    వైెఎస్ఆర్ రైతు భరోసా జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేశ్ పేరు


    ఈ నిబంధనల నేపథ్యంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరును ఈ జాబితాలో ఏ రకంగా చేర్చారనే అంశంపై చర్చ మొదలైంది. ఎంపీపీలు, ఎంపీటీసీ, సర్పంచ్‌లుగా పని చేసిన వాళ్లు కూడా ఈ పథకానికి అనర్హులు అని నిబంధనలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం... ఒక ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న వ్యక్తిగా ఈ పథకాన్ని ఏ రకంగా వర్తింపజేస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ అంశంపై మంత్రి సురేశ్ స్పందించారు. దీనిపై విచారణ జరపాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇలాంటి జాబితాలను ప్రకటించే ముందుకు ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap cm ys jagan mohan reddy, Ap minister suresh, Prakasam, Ysr rythu bharosa, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు