• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP LEGISLATIVE COUNCIL SENT THREE CAPITALS AND CRDA REPLACE BILLS TO SELECT COMMITTEE BA

మూడు రాజధానులకు బ్రేక్... సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపిన మండలి చైర్మన్...

మూడు రాజధానులకు బ్రేక్... సెలక్ట్ కమిటీకి బిల్లులు పంపిన మండలి చైర్మన్...

ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. తనకున్న విచక్షాధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. అయితే, చైర్మన్ నిర్ణయాన్ని అధికార వైసీపీ సభ్యులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. శాసనమండలి చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోడియం ఎక్కేందుకు కొందరు మంత్రులు ప్రయత్నం చేశారు. చైర్మన్ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    అంతకు ముందు శాసనమండలిలో భారీ హైడ్రామా జరిగింది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అవసరం లేదని వైసీపీ వాదించారు. ఈ అంశంపై ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రెండు పార్టీల ప్రజాప్రతినిధులు కొట్టుకునే వరకు వెళ్లారు. శాసనమండలి సాక్షిగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారాలు కూడా నిలిచిపోవడంతో అసలు ఏం జరుగుతుందనే అంశం బయటి ప్రపంచానికి తెలియలేదు.

    మండలిలో తీవ్ర ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సభను పది నిమిషాల పాటు వాయిదా వేసిన షరీఫ్... తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం అయ్యారు. అదే సమయంలో అధికార, విపక్షాలకు చెందిన ఎమ్మెల్సీలు కూడా చైర్మన్ ఛాంబర్‌కు వెళ్లి మంతనాలు చేశారు. అక్కడ కూడా ఎవరి వాదనను వారు వినిపించారు. సుమారు మూడు గంటల పాటు వారి చర్చలు జరిగాయి. అనంతరం సభకు వచ్చిన చైర్మన్ తన విచక్షణాధికారాలతో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించకుండా సభ నుంచి లేచి వెళ్లిపోయారు. వెంటనే తన ఛాంబర్‌కు వెళ్లి అక్కడి నుంచి కూడా క్షణాల్లోనే తన కారులో వెళ్లిపోయారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: