
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సెలక్ట్ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. సెలక్ట్ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు పడింది. శాసనసభ ఆమోదించిన అభివృద్ధి, అధికార వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే. ఈ రెండు బిల్లులకు రెండు సెలక్ట్ కమిటీలను శాసనమండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఒక్కో సెలక్ట్ కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారని షరీఫ్ ప్రకటించారు. ఆ కమిటీకి సంబంధిత బిల్లును పెట్టిన మంత్రి చైర్మన్‌గా ఉంటారు. ఐదుగురు టీడీపీ సభ్యులు, ఒక వైసీపీ, ఒక పీడీఎఫ్, ఒక బీజేపీ సభ్యుడు అందులో మెంబర్స్‌గా ఉంటారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు మీద ఏర్పాటయ్యే సెలక్ట్ కమిటీకి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఆర్డీఏ రద్దు బిల్లు మీద ఏర్పాటయ్యే సెలక్ట్ కమిటీకి మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్లుగా వ్యవహరిస్తారు. ఈ కమిటీల్లో సభ్యులను సూచించాల్సిందిగా ఆయా పార్టీలకు శాసనమండలి చైర్మన్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కమిటీ సభ్యులను ప్రతిపాదించిన తర్వాత పూర్తిస్థాయిలో కమిటీ ఏర్పాటుకానుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:January 26, 2020, 15:32 IST