సెలెక్ట్ కమిటీ అంశంలో ట్విస్ట్.. గవర్నర్ వద్దకు మండలి ఛైర్మన్ షరీఫ్

అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు పాసైనట్లేనని ఇటీవల ఏపీ మంత్రులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 14 రోజులు ముగిసినందున బిల్లులు పాసైనట్లేనని మంత్రి పిల్లి సుభాష్ అన్నారు.

news18-telugu
Updated: February 18, 2020, 8:40 PM IST
సెలెక్ట్ కమిటీ అంశంలో ట్విస్ట్.. గవర్నర్ వద్దకు మండలి ఛైర్మన్ షరీఫ్
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ (ఫైల్)
  • Share this:
ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ రెండు బిల్లులను మండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపుతామని ప్రకటించినప్పటికీ.. ఆ దిశగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిబంధనలు పాటించలేదనే కారణంతో వాటిని మండలి కార్యదర్శి రెండుసార్లు తిప్పి పంపారు. దాంతో అసలు సెలెక్ట్ కమిటీ ఏర్పాటువుతుందా? ఆ రెండు బిల్లుల పరిస్థితేంటన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ మంగళవారం సాయంత్రం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. మండలి ఛైర్మన్ రూలింగ్‌ను అమలు చేయకుండా కార్యదర్శి జాప్యం చేయడంపై ఫిర్యాదు చేశారు.

సెలెక్ట్ కమిటీ విషయంలో జరిగిన దాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. రూలింగ్ అమలు చేయకుండా కార్యదర్శి జాప్యం చేయడంపై ఫిర్యాదు చేశాం. నాకు విశిష్ట అధికారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఛైర్మన్ నిర్ణయాన్ని కార్యదర్శి వ్యతిరేకించడం ఇప్పటి వరకు జరగలేదు.
షరీఫ్, ఏపీ శాసనమండలి ఛైర్మన్
అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు పాసైనట్లేనని ఇటీవల ఏపీ మంత్రులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 14 రోజులు ముగిసినందున బిల్లులు పాసైనట్లేనని మంత్రి పిల్లి సుభాష్ అన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపే విషయంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనందున అది వీగిపోయిందని.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ రెండు బిల్లులకు ఆమోదం లభించినట్లేనని స్పష్టంచేశారు. అ విచక్షణాధికారాన్ని ఎక్కడపడితే అక్కడ ఉపయోగించడం కుదరదని మండలి ఛైర్మన్‌పై విమర్శలు గుప్పించారు పిల్లి సుభాష్. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ హరిచందన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు