తుని జర్నలిస్ట్‌ హత్య: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 4:23 PM IST
తుని జర్నలిస్ట్‌ హత్య: వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
సత్యనారాయణ
  • Share this:
జర్నలిస్ట్ సత్యనారాయణ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసునమోదు చేశారు. సత్యనారాయణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో పాటు మరో ఐదుగురిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో దాడిశెట్టి రాజాను ఆరో నిందితుడిగా చేర్చారు. కాగా, రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి తొండంగి అర్బన్ రిపోర్టర్ సత్యనారయణను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో నరికి చంపారు. తుని మండలం ఎస్ అన్నవరం వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఈ దారుణం జరిగింది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా దుండగులు సత్యనారాయణను హత్య చేశారు. సత్యనారాయణ ఇంటికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సీఎం జగన్ సైతం సీరియస్‌గా ఉన్నారు. జర్నలిస్టులపై దాడులను ఉపేక్షించేది లేదని.. సత్యనారాయణ హత్య కేసును లోతైన దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading