నారా లోకేశ్‌ ట్వీట్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన హోం మంత్రి సుచరిత

ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్ పై దాడి జరిగితే.. దానిని కోడికత్తి దాడిగా నాటి అధికార టీడీపీ నేతలు ప్రచారం చేశారని హోం మంత్రి సుచరిత గుర్తుచేశారు. అలాంటి టీడీపీకి వైసీపీపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు.

news18-telugu
Updated: June 18, 2019, 10:47 AM IST
నారా లోకేశ్‌ ట్వీట్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన హోం మంత్రి సుచరిత
మేకతోటి సుచరిత(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 18, 2019, 10:47 AM IST
టీడీపీ కార్యకర్తలపై అధికార వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్‌ చేయడంపై ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.  మహిళా అధికారిణిని చెంప మీద కొట్టినా పట్టించుకోని పరిస్థితి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండేదని ఆమె వ్యాఖ్యానించారు. కాల్ మనీ వ్యవహారంలో  అన్యాయాన్ని నిలదీసినందుకు తమ పార్టీ ఎమ్యెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న జగన్ పై దాడి జరిగితే.. దానిని కోడికత్తి దాడిగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. అలాంటి టీడీపీకి వైసీపీపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు.

ఇటీవల జరిగిన ఘర్షణల్లో టీడీపీకి చెందిన వాళ్ళ కంటే వైసీపీ వాళ్లే ఎక్కువగా గాయపడ్డారని మంత్రి చెప్పారు. టీడీపీకి చెందిన వాళ్లు 44 మంది గాయపడితే వైసీపీకి చెందిన వాళ్ళు 57 మంది గాయపడ్డారని తెలిపారు. అయినా  శాంతిభద్రతలకు విఘాతం కల్గించవద్దని సీఎం జగన్ ఇదివరకే చెప్పారని హోం మంత్రి  మేకతోటి సుచరిత గుర్తుచేశారు.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...