గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో హోంమంత్రి ఆకస్మిక తనిఖీలు

మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోందని.. ఫిర్యాధిదారులతో పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో దురుసుగా వ్యవహరించకూడదని పోలీసులకు తెలిపారు సుచరిత.

news18-telugu
Updated: December 3, 2019, 2:57 PM IST
గుంటూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో హోంమంత్రి ఆకస్మిక తనిఖీలు
మహిళా పోలీస్ స్టేషన్‌‌లో హోంమంత్రి ఆకస్మిక తనిఖీలు
  • Share this:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గుంటూరు నగరంలోని అర్బన్ మహిళ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు, గుంటూరు నుండి మరొక కార్యక్రమానికి బయలుదేరిన మంత్రి మార్గమధ్యంలో తన కాన్వాయ్ ఆపి పోలీస్ స్టేషన్ లోకి వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్నారు హోంమంత్రి.  పోలీసు స్టేషన్‌లో ఉన్న అన్ని రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయ, దిశ ఘటనలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.  పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.

అంతేకాకుండా పరిధి చూడకుండా సంబంధిత ఘటనలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పోలీసులకు సూచించారు. మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోందని.. ఫిర్యాధిదారులతో పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో దురుసుగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా పోలీసు స్టేషన్‌లో మహిళా అధికారులను నియమించనున్నామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు.
First published: December 3, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading