చంద్రబాబుకు ఏపీ హోంమంత్రి సుచరిత ప్రతి సవాల్..

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో ముందు రాజీనామా చేయించాలని హోంమంత్రి సుచరిత ప్రతి సవాల్ విసిరారు.

news18-telugu
Updated: August 5, 2020, 8:29 PM IST
చంద్రబాబుకు ఏపీ హోంమంత్రి సుచరిత ప్రతి సవాల్..
మేకతోటి సుచరిత, ఏపీ హోంమంత్రి
  • Share this:
ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు విసిరిన సవాల్‌కు హోంమంత్రి మేకతోటి సుచరిత కౌంటర్ సవాల్ విసిరారు. మూడు రాజధానులపై జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలన్న చంద్రబాబుకు హోంమంత్రి కౌంటర్ ఇచ్చారు. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో ముందు రాజీనామా చేయించాలని హోంమంత్రి సుచరిత ప్రతి సవాల్ విసిరారు. ‘చంద్రబాబు మొదట తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి. రాజధాని తరలింపు కాదు.. అభివృద్ధీ వికేంద్రీకరణ మాత్రమే చేస్తున్నాం. రాజధాని రైతులకు కౌలు పెంచిన ఘనత సీఎం జగన్‌కు ఉంది.’ అని సుచరిత అన్నారు.

దళితులపై అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసు అధికారులను జగన్ ప్రభుత్వం సహించదని సుచరిత స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళితుడిని కాలుతో తగ్గిన సీఐను సస్పెండ్ చేశామన్నారు. రాజామండలం, చీరాల సంఘటనలకు కారణమైన అధికారులను సైతం సస్పెండ్ చేశామన్నారు. ఘటనకు కారణమైన పోలీసులపై అట్రాసిటీ కేసులు పెట్టినట్టు చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే ఇంత వేగంగా చర్యలు తీసుకున్న సందర్భం గతంలో లేదన్నారు. ‘దళితుడిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడిన చరిత్ర చంద్రబాబుది. ఆదినారాయణరెడ్డి, చింతమనేని దళితులను కించపర్చితే చంద్రబాబు మందలించలేదు. మా ప్రభుత్వంలో వరకట్న వేదింపులు, మహిళలపై నేరాలు తగ్గాయి. రాష్ట్రపతి ఆమోదం లభించకపోయినా 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రెండ్లీ పోలీసింగ్ మా ప్రభుత్వ ధ్యేయం. పోలీసులు కూడా సమన్వయం తో పనిచేయాలి.’ అని సుచరిత అన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 8:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading