ఆ ప్రకారమే చంద్రబాబుకు ఏపీలోకి ఎంట్రీ... హోంమంత్రి క్లారిటీ..

సోమవారం తాను ఆంధ్రప్రదేశ్‌ వెళ్లాలనుకుంటున్నట్టు చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

news18-telugu
Updated: May 24, 2020, 4:17 PM IST
ఆ ప్రకారమే చంద్రబాబుకు ఏపీలోకి ఎంట్రీ... హోంమంత్రి క్లారిటీ..
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణలోని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఆయనకు అనుమతి వచ్చింది. ఏపీ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. చంద్రబాబు అనుమతి కోసం అప్లై చేసుకొని ఉంటే అనుమతి వస్తుందన్నారు. కోవిడ్ 19 పై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం చంద్రబాబుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. విశాఖ డాక్టర్ సుధాకర్‌తో పోలీసులు వ్యవహరించిన తీరు మీద సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై హోంమంత్రి స్పందించారు. గతంలో చాలా కేసుల్లో సీబీఐ విచారణ వద్దని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. అసలు రాష్ట్రంలోకి సీబీఐ రావడానికే వీల్లేదని కూడా చంద్రబాబు చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ప్రతి కేసులో సీబీఐ విచారణ కోరుతున్నారని విమర్శించారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద చల్లాలను చూస్తున్నారని మేకతోటి సుచరిత మండిపడ్డారు. ఇచ్చిన హామీలను సంవత్సర కాలంలోపే పూర్తి చేసిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు.

విమానం, రైలు, ఇతర రాష్ట్రాల బస్సు ప్రయాణికులకు కొత్త రూల్స్...
First published: May 24, 2020, 4:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading