ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేసిన ఏపీ హైకోర్టు..

ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై  ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

news18-telugu
Updated: May 22, 2020, 2:58 PM IST
ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తేసిన ఏపీ హైకోర్టు..
ఏబీ వెంకటేశ్వర రావు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై  ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసింది. ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, సస్పెన్షన్ విధించిన కాలానికి సంబంధించి కూడా ఆయనకు జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి క్యాట్ ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు పక్కన పెట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1989 ఏపీ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. అయితే, ఏడీజీపీగా పనిచేసినప్పుడు ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడినట్లు డీజీపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ ప్రభుత్వం తన ఆదేశాల్లో తెలిపింది.

ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు


గతంలో పోలీసు శాఖ ఆధునికీకరణ పేరుతో రాష్ట్ర ఖజానాకు రూ.25కోట్ల మేర నష్టం కలిగించారంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిన నివేదిక మీద సమగ్రమైన చార్జ్ షీట్ దాఖలు చేయాలని కేంద్ర హోంశాఖ సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతిపై ఏసీబీ డీజీతో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిస్తోందని జగన్ సర్కారు కేంద్రానికి తెలియజేసింది. అయితే, ఆ నివేదికను తమకు తెలియజేయాలని కేంద్ర హోశాఖ సూచించింది.
First published: May 22, 2020, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading