Home /News /politics /

AP HIGH COURT SERIOUS ON PASSWORD LEAK IN NIMMAGADDA RAMESH KUMAR PETITION HEARING BA

నిమ్మగడ్డ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఊహించని పరిణామం..

నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు

నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు

విచారణ జరుగుతున్న సమయంలో వాస్తవానికి 10 మంది మాత్రమే ఆన్ లైన్లో ఉండాల్సి ఉండగా, సుమారు 40 మంది ఆన్ లైన్లో ప్రత్యక్షం అయ్యారు.

    ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వివాదానికి సంబంధించి ఈ రోజు హైకోర్టు విచారణలో ఊహించని పరిణామం ఎదురైంది. నిన్న విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు కూడా దాన్ని కొనసాగించింది. కేసును ఆన్ లైన్లో విచారణ జరుపుతోంది. ఈ కేసులో పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులకు ఓ పాస్ వర్డ్ ఇచ్చి ఆన్ లైన్ ద్వారా విచారణ జరుపుతున్నారు. అయితే, ఈరోజు విచారణ జరుగుతున్న సమయంలో వాస్తవానికి 10 మంది మాత్రమే ఆన్ లైన్లో ఉండాల్సి ఉండగా, సుమారు 40 మంది ఆన్ లైన్లో ప్రత్యక్షం అయ్యారు. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆశ్చర్యంతో పాటు ఆగ్రహానికి గురయ్యారు. కేవలం 10 మందికి మాత్రమే పాస్ వర్డ్ ఇస్తే, ఇంత మంది ఎలా వచ్చారని సీరియస్ అయ్యారు. పాస్ వర్డ్ లీక్ చేయడం వల్లే ఇలా జరుగుతోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

    ఇకపై కేసు విచారణను హైకోర్టులోనే ప్రత్యక్షంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. అయితే, కొందరు న్యాయవాదులు హైదరాబాద్ నుంచి కూడా రావాల్సి ఉండడంతో వారు తమకు ఎదురయ్యే ఇబ్బందులను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తులు ఈ కేసులో వాదనలు వినిపించే న్యాయవాదులకు పాస్‌లు ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీలకు తాము లేఖలు రాస్తామని తెలిపింది. ఏపీ డీజీపీ కోర్టు సిబ్బందే స్వయంగా వెళ్లి అందజేస్తారని స్పష్టం చేసింది. దీంతో అందరూ కోర్టులోనే సామాజిక దూరం పాటిస్తూ వాదనలు వినిపించేందుకు అందరూ సిద్ధమయ్యారు. అనంతరం కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Ap local body elections, Nimmagadda Ramesh Kumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు