జగన్‌కు షాక్... కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సీరియస్

సోమవారం కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు.

news18-telugu
Updated: February 4, 2020, 4:13 PM IST
జగన్‌కు షాక్... కార్యాలయాల తరలింపుపై హైకోర్టు సీరియస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విజిలెన్స్ కార్యలయం తరలింపుపై హైకోర్టు విచారణ  చేపట్టింది. దీనిపై వివరణ ఇవ్వలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటీషన్లు పెండింగ్‌లో ఉండగా కార్యాలయాల్ని ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించదు. దీంతో మూడురోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ తెలిపారు. ఈ నెల 26 వరకు కార్యాలయాల తరలింపును ఈనెల 26వరకు నిలిపివస్తే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సోమవారం కార్యాలయాల తరలింపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఇంక్వైరీస్ కార్యాలయాలను.. కర్నూలు తరలించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెం.13 చట్ట విరుద్ధమని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ చైర్మన్‌, సీఆర్డీఏను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవలే కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కర్నూలుకు పలు ప్రభుత్వ కార్యాలయాలను తరలించడంలో ఎలాంటి తప్పులేదని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కర్నూలును ఏపీ జ్యూడీషియల్ క్యాపిటల్‌గా చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం... అందుకు తగ్గట్టుగానే కార్యాలయాలను తరలిస్తోందని ఆయన వివరించారు. న్యాయశాఖకు చెందిన కార్యాలయాలు, ట్రిబ్యూనల్స్‌ను కర్నూలుకు తరలిస్తున్నామని ఆయన వివరించారు. అయినా ఇదేమీ కొత్త విషయం కాదని... గతంలో చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే తాము నడుచుకుంటున్నామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే అంశంతోనే తాము ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు.

ప్రస్తుతం తరలిస్తున్న కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయం నుంచి పనిచేస్తున్నాయి. పరిపాలనా కారణాల రీత్యా వీటిని కర్నూలుకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను గుర్తించాల్సిందిగా కర్నూలు జిల్లా కలెక్టర్‌, రోడ్లు భవనాల శాఖ ఇంజినీర్‌ ఇన్‌చీఫ్‌లను ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. వీలైనంత త్వరలో మరిన్ని కార్యాలయాలను అమరావతి నుంచి తరలించేందుకు రంగం సిద్దం చేస్తోంది ఏపీ సర్కార్. ఈ నెలాఖరులోగా కొన్ని కీలక కార్యాలయాల తరలింపుపైనా అధికారికంగా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు తాజాగా హైకోర్టు దీనిపై స్టే విధించడంతో.. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడినట్లైంది.
Published by: Sulthana Begum Shaik
First published: February 4, 2020, 1:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading