జగన్ సర్కారుకు హైకోర్టు మరో షాక్.. స్థానిక ఎన్నికలకు లింకు పెట్టి మరీ చీవాట్లు..

ఏపీ హైకోర్టు జగన్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ఖచ్చితం చేస్తూ తీసుకొచ్చిన జీవోలను కొట్టేసిన న్యాయస్థానం.. తాజాగా పంచాయతీ ఆఫీసులకు వైసీపీ రంగులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: April 17, 2020, 8:36 AM IST
జగన్ సర్కారుకు హైకోర్టు మరో షాక్.. స్థానిక ఎన్నికలకు లింకు పెట్టి మరీ చీవాట్లు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ హైకోర్టు జగన్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ఖచ్చితం చేస్తూ తీసుకొచ్చిన జీవోలను కొట్టేసిన న్యాయస్థానం.. తాజాగా పంచాయతీ ఆఫీసులకు వైసీపీ రంగులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల్ని తొలగించేందుకు జగన్ సర్కార్ మూడు నెలల గడువు కోరగా.. అందుకు హైకోర్టు గడువు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఒక వేళ గడువు ఇస్తే స్థానిక ఎన్నికలను నిర్వహించకుండా ఉంటారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలు పూర్తయ్యేదాకా రంగులు అలాగే ఉంచాలన్న కారణంతో గడువు కోరుతున్నట్లుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో.. లాక్‌డౌన్ ముగిశాక కొత్త రంగులేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారుల నుంచి సమాచారం తీసుకోని కోర్టుకు వెల్లడిస్తామని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని కోరగా జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

కాగా.. గతంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసిన జగన్ ప్రభుత్వానికి అక్కడ కూడా దెబ్బ తగిలింది. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో కొత్త రంగులను సూచించేందుకు జగన్ సర్కార్ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
Published by: Shravan Kumar Bommakanti
First published: April 17, 2020, 8:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading