జగన్ సర్కారుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వెంటనే ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన్ను తొలగిస్తూ తెచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుతం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం లేదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఇంతకుముందు తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారనే నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. ఎందుకు ఆయన్ను తొలగించారని ప్రశ్నించగా రాష్ట్ర ఎన్నికల సంఘంలో సంస్కరణల్లో భాగంగా కొత్త ఎన్నికల కమిషనర్‌ను నియమించామని అఫిడవిట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. రిటైడ్ జడ్జీలను ఎస్ఈసీగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా కోర్టుకు వివరించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా రూపొందించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
అయితే, గవర్నర్ తెచ్చిన ఆర్డినెన్స్ ఇప్పుడు పనిచేయదని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను విధుల్లోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎలక్షన్ కమిషనర్‌గా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజు కొనసాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నట్టేనని వివరించారు.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.