నిమ్మగడ్డ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. గవర్నర్ వద్దకు పంచాయితీ

నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఈ సందర్భంగా హైకోర్టు మండిపడింది.

news18-telugu
Updated: July 17, 2020, 11:40 AM IST
నిమ్మగడ్డ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు.. గవర్నర్ వద్దకు పంచాయితీ
నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఏపీ హైకోర్టు
  • Share this:
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి వినతీ పత్రం సమర్పించాల్సిందిగా నిమ్మగడ్డను ఏపీ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరాల్సిందిగా సూచించింది. హైకోర్టు తీర్పు ఇచ్చినా తనను SECగా నియమించకపోవడంపై హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఏపీ ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై ఈ సందర్భంగా హైకోర్టు మండిపడింది.

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే నిరాకరించినా ఇప్పటి వరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్నిఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

ఏపీలో నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ..రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న రమేష్, ఏపీలో స్థానిక సంస్థలను ఉద్దేశపూర్వంగానే వాయిదా వేశారని వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఆ క్రమంలోనే ఆయన పదవీ కాలాన్ని తగ్గిస్తూ జీవో తెచ్చింది. అనంతరం రాష్ట్ర ఎన్నికల అధికారికగా కనకరాజ్‌ను నియమించారు. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కోర్టును ఆశ్రయించడంతో ఆర్డినెన్స్‌ను రద్దుచేయడంతో పాటు నిమ్మగడ్డను తిరిగి ఎన్నికల అధికారిగా నియమించాలని ఆదేశించింది.

హైకోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా రావడంతో.. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐతే హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఐనప్పటికీ రమేష్ కుమార్‌ను ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఏపీ ప్రభుత్వం నియమించలేదు. ఈ క్రమంలోనే ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. గవర్నర్‌ను కలిసి హైకోర్టును ఆదేశాలను అమలు చేయాల్సిందిగా కోరాలని సూచించింది.
Published by: Shiva Kumar Addula
First published: July 17, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading