ఎమ్మెల్యే రోజాకు హైకోర్టు నోటీసులు.. మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా..

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది.

news18-telugu
Updated: May 5, 2020, 12:54 PM IST
ఎమ్మెల్యే రోజాకు హైకోర్టు నోటీసులు.. మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా..
ఏపీ అసెంబ్లీలో రోజా
  • Share this:
ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమెతో పాటు మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. కరోనా వైరస్ వ్యాప్తికి వైసీపీ నేతలే కారణం అని, వాళ్లు ఇష్టారాజ్యంగా తిరగడం వల్లే కరోనా తీవ్రంగా వ్యాపించిందని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించిన ఎమ్మెల్యేలు రోజా, విడదల రజిని, వెంకట గౌడ్, మధుసూదన్ రెడ్డి, సంజీవయ్యకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా.. నిబంధనలు ఉల్లంఘించిన వీళ్లపై ఏ చర్యలు తీసుకున్నారో వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని జగన్ ప్రభుత్వానికి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
First published: May 5, 2020, 12:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading