జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు..

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లలో రిగ్గింగ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.

news18-telugu
Updated: October 23, 2019, 8:46 PM IST
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు..
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
  • Share this:
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ ఓట్లలో రిగ్గింగ్ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దీంతో రాపాక ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై రాపాకతో పాటు రిటర్నింగ్ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ మాత్రమే విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి రాపాక వరప్రసాద్, వైసీపీ తరఫున బొంతు రాజేశ్వరరావు, టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ 1167 ఓట్ల తేడాతో బొంతు రాజేశ్వరరావు మీద విజయం సాధించారు. రాపాకకు 48740 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 47,572 ఓట్లు వచ్చాయి.

జగన్ ఫొటోకు జనసేన ఎమ్మెల్యే పాలాభిషేకంFirst published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>