ఏపీలో ఆ ఎన్నికలకు లైన్ క్లియర్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం... ప్రభుత్వ విధివిధానాలు సవాల్ చేసిన వారి విజ్ఞప్తిని తిరస్కరించింది.

news18-telugu
Updated: November 15, 2019, 4:58 PM IST
ఏపీలో ఆ ఎన్నికలకు లైన్ క్లియర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం... ప్రభుత్వ విధివిధానాలు సవాల్ చేసిన వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీనిపై కూడా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిపై విచారణను నాలుగు వారాలు వాయిదా వేసిన హైకోర్టు.. ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ప్రభుత్వానికి ఓకే చెప్పింది. దీంతో ఇప్పటికే పదవీ కాలం పూర్తయిన సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు మార్గం లైన్ క్లియర్ అయ్యింది.

సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై విధివిధానాలు కూడా సిద్ధం చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. ఎన్నికలపై స్టే ఇవ్వాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.






First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...