ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని స్పష్టం చేసింది.
అలాగే వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో సహా 2 నెలల్లోపు చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా నేపథ్యంలో కేంద్రంతో పాటు పలు రాష్ట్రా ప్రభుత్వాలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం 50 శాతమే జీతాలను చెల్లించేలా జీవోను జారీచేసిన చేసిన విషయం తెలిసిందే. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో.. ఆ జీవోను కోర్టు కొట్టివేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.