అలా కుదరదు..వీవీప్యాట్‌లపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు

ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను కొట్టివేసింది.

news18-telugu
Updated: May 21, 2019, 5:26 PM IST
అలా కుదరదు..వీవీప్యాట్‌లపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు
ఈవీఎం, వీవీప్యాట్ (File)
news18-telugu
Updated: May 21, 2019, 5:26 PM IST
వీవీప్యాట్‌లపై దాఖలైన పిల్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈవీఎం కంటే ముందే వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. వీవీప్యాట్ స్లిప్పుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు గౌరవిస్తామని ఈసీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే లెక్కింపులు ఉంటుందని వెల్లడించారు. నాలుగు గంటల పాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఆ పిల్‌ను కొట్టివేసింది. ముందు ఈవీఎంలను లెక్కిస్తామన్న ఈసీ వాదనతో ఏకీభవించింది.

ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంల కంటే ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఈసీని కోరుతూ హైకోర్టులో అత్యవసరంగా ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. వీవీప్యాట్‌ స్లిప్పులు, ఈవీఎంల మధ్య ఓట్ల సంఖ్యలో తేడా వచ్చిన సందర్భంలో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని అన్ని వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది బాలాజీ యలమంజుల ఈ పిల్‌ను దాఖలు చేశారు.

ఈవీఎంల చివరి రౌండ్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక అయిదు వీవీప్యాట్‌ల స్లిప్పులను లెక్కించడానికి బదులు ప్రారంభంలోనే స్లిప్పులను లెక్కించేలా ఆదేశించాలని పిటీషనర్‌ వ్యాజ్యంలో కోరారు. ఈవీఎంల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థికి అత్యధిక ఓట్లు వచ్చాయో తెలిసిపోతుందని, ఆ తర్వాత వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించడం వల్ల ఉపయోగం లేకపోగా, వివాదాలకు తావిస్తుందని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ కె.విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఆ పిల్‌ను కొట్టివేసింది.First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...