ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో కార్మిక, న్యాయ శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం మీద సీబీఐ విచారణ జరపాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో కార్మిక, న్యాయ శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం మీద సీబీఐ విచారణ జరపాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుమ్మనూరు పేకాట వ్యవహారంలో మంత్రి పాత్ర తేల్చడానికి సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి, విచారణలో మంత్రి జయరాం పాత్ర తేల్చాలని పిటిషనర్ కోరారు. ఆ పిటిషన్ పై విచారణకు హైకోర్టు అనుమతించింది. దీంతో మంత్రి జయరాంను పిటిషనర్ ప్రతివాదిగా చేర్చారు.
గుమ్మనూరు జయరాం స్వగ్రామం గుమ్మనూరులో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఈ ఏడాది ఆగస్టులో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 40 వాహనాలు, రూ.5.44 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 33 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు నుంచి నాలుగు ప్రత్యేక వాహనాల్లో వచ్చిన పోలీసు బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. పోలీసులు వచ్చారన్న సమాచారం తెలుసుకున్న మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ అనుచరులు పోలీసులపై ఒక్కసారిగా ఎదురు దాడికి పాల్పడ్డట్లు సమాచారం. కారంపొడి పోలీసులపై చల్లుతూ పేకాటరాయుళ్లు తిరగబడ్డట్లు తెలుస్తోంది.
మంత్రి జయరాం (File)
33 మంది పేకాట రాయుళ్లు పరారవుతుండగా వారిని పట్టుకొని చిప్పగిరి పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు స్పెషన్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ గౌతమిశాలి వెల్లడించారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 40 వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఆమె వెల్లడించారు. ఈ దాడుల్లో ఒక సీఐ, నలుగురు ఎస్సైలు, 20 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నట్లు తెలిపారు. అయితే, గుమ్మనూరు గ్రామంలో జరిగిన పేకాట వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనని తేల్చిచెప్పారు.
మంత్రి జయరాం స్వగ్రామంలో పట్టుబడిన పేకాటరాయుళ్ల కార్లు
మరోవైపు టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు నిందితుడిగా ఉ్న ఈఎస్ఐ స్కాంలో ఏ-14 నిందితుడు ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారు కొనిచ్చారని మరో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేశారు. మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు.. తెలకపల్లి కార్తీక్ కారు అందజేసిన ఫోటోలను మీడియాకు రిలీజ్ చేశారు. ఈశ్వర్ బర్త్ డే రోజున బెంచ్ కారు ఇచ్చారని, దానికి సంబంధించిన ఫోటోలను చూపారు. కారును ఎందుకు గిప్ట్గా ఇచ్చారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ-14 కార్తీక్.. మంత్రి జయరాంకు బినామీ అని ఆరోపించారు. అందుకోసమే పుట్టినరోజు సాకు చూపి.. మంత్రికి లంచం ఇచ్చారని ఆరోపించారు. వాస్తవానికి కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది మాజీ మంత్రి అచ్చెన్నాయడు కాదని.. మంత్రి జయరాం అని ఆరోపించారు. దీనికి సంబంధించి ఏ కమిటీ వేసినా ఆధారాలు సమర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
మరోవైపు జగన్ కేబినెట్లో మరో మంత్రి కొడాలి నాని మీద చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ ప్రయత్నిస్తుండగా, ఉద్యోగలను రెచ్చగొట్టేందుకు మంత్రి కొడాలి నాని ప్రేరేపిస్తున్నారని రమేష్ కుమార్ ఆరోపించారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.