వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో పేరు లేదని... చేనేత కార్మికుడి ఆత్మహత్య

తనను టీడీపీ కార్యకర్తగా భావించి అధికారులు తనపేరు చేర్చలేదని ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు.

news18-telugu
Updated: December 25, 2019, 12:14 PM IST
వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో పేరు లేదని... చేనేత కార్మికుడి ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తన పేరు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో లేదని మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా సోమందేవపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది. నర్సింహులు అనే చేనేత కార్మికుడు తన పేరు వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో లేదని మనస్తాపానికి గురయ్యాడు. తనను టీడీపీ కార్యకర్తగా భావించి అధికారులు తనపేరు చేర్చలేదని ఆవేదనకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. నీలూరి నరసింహులు చేనేత వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. భార్య, ఇద్దరు కూతుళ్లు కూడా ధర్మవరంలో ఉంటూ మగ్గం నేస్తున్నారు.

ఇటీవలే తన పుట్టినరోజు అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించిన జగన్ ‘వైఎఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించారు. ధర్మవరంలో భారీ సభలో జగన్ 47వ జన్మదిన వేడుకలు కూడా జరుపుకన్నారు. నేతన్న నేస్తం పథకం ప్రారంభించి... చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందిస్తుందని జగన్ తెలిపారు. అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. వీరితోపాటూ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచీ ప్రయోజనం పొందుతారిన సీఎం జగన్ పేర్కొన్నారు.

First published: December 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు