గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్... 4 మార్కులు అదనం

డిజిటల్ అసిస్టెంట్ పరీక్షలో కూడా 2 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు.

news18-telugu
Updated: September 8, 2019, 12:11 PM IST
గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్... 4 మార్కులు అదనం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 8, 2019, 12:11 PM IST
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో గ్రామ సచివాలయ పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ ప్రభుత్వం తీపికబురు తెలిపింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీసు, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ, వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ పోస్టులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు. ఈ పరీక్షల్లో రెండు ప్రశ్నల్లో తప్పులు దొర్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఈనెల 1, 2 తేదీల్లో నిర్వహించిన సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షలకు... 11,62,164 మంది హాజరయ్యారు. దీనికోసం 4,465 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు సంబంధించిన ‘కీ’ని అధికారులు తాజాగా విడుదల చేశారు. మరోవైపు ఈ నెల 1న జరిగిన డిజిటల్ అసిస్టెంట్ పరీక్షలో కూడా 2 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 2 మార్కులు కలపాలని నిర్ణయించారు. ఈ ప్రశ్నలకు గానూ అభ్యర్థులు ఏ జవాబును పెట్టినా పూర్తి మార్కులు ఇస్తామని పేర్కొన్నారు. మొత్తం మీద సచివాలయ అభ్యర్థులకు నాలుగు మర్కులు అదనంగా దొరకనున్నాయి.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...