
డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
గత రెండు రోజులుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో జరుగుతున్న వివాదాలపై టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
థర్టీ ఇయర్స్ పృథ్వి రాజ్ రాజీనామాతో ఇప్పుడు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఖాళీ అయ్యింది. దీంతో జగన్ ఆ పదవి ఈసారి ఎవరికి ఇస్తారన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ప్రముఖ దర్శకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఈసారి శ్రీనివాస్ రెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో జరుగుతున్న వివాదాలపై టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఆదివారం ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఎస్వీబీసీ చైర్మన్ ఎవరు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో వై.వి.సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్వీబీసీ కొత్త ఛైర్మన్‌గా ఎస్ శ్రీనివాస్ రెడ్డిని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా, రాగల 24 గంటలు వంటి సినిమాలు తీశారు. త్వరలో ఆయన తీస్తున్న మరో సినిమా ‘భార్యాభర్తల సంఘం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Published by:Sulthana Begum Shaik
First published:January 13, 2020, 12:59 IST