జగన్ ఖాతాలో మరో సక్సెస్.. ఏపీకి రూ.83 కోట్లు ఆదా

స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ మరోసారి విజయవంతమయ్యారు. ఈసారి మరో రూ.83.8 కోట్లు ఆదా చేశారు.

news18-telugu
Updated: December 3, 2019, 8:33 PM IST
జగన్ ఖాతాలో మరో సక్సెస్.. ఏపీకి రూ.83 కోట్లు ఆదా
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఏపీలో ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఐనప్పటికీ ప్రభుత్వ మాత్రం పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ పద్దతిని అవలంభించి భారీగా ప్రభుత్వ నిధులను ఆదా చేసింది. పోలవరం విషయంలో సక్సెస్ కావడంతో అదే ఫార్ములాను ఇతర ప్రభుత్వ ఒప్పందాల్లోనూ అప్లై చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లిన సీఎం వైఎస్ జగన్ మరోసారి విజయవంతమయ్యారు. ఈసారి మరో రూ.83.8 కోట్లు ఆదా చేశారు.

గ్రామ,వార్డు వాలంటీర్లకోసం 2,64,920 సెల్‌ఫోన్లు కొనుగోలు కోసం ఇటీవల టెండర్లను ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. నవంబర్‌ 30న ఏపీటీఎస్‌ ( ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) తొలిదశ బిడ్డింగ్‌ తెరవగా.. అప్పుడు ఎల్-1 సంస్థ రూ. 317.61 కోట్లు కోట్‌చేసింది. దీనిపై రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది ఏపీటీఎస్‌. ఐతే ఈ సారి ఆ కంపెనీ కేవలం రూ. 233.81 కోట్ల (26.4 శాతం తక్కువ)కు కోట్‌ చేసి బిడ్‌ దక్కించుకుంది. తొలిదశ బిడ్డింగ్‌ కన్నా రూ. 83.8 కోట్ల మేర తక్కువకు కోట్‌ చేసింది.

ఇక ప్రతి సెల్‌ఫోన్‌కు ఒక ఏడాది పాటు వారెంటీ, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ, ఆక్టాకోర్‌ ప్రొసెసర్‌లతో కూడిన సెల్‌ఫోన్లను అందించనుంది ఎల్-1 సంస్థ. దీంతోపాటు మొబైల్‌ సాఫ్ట్‌వేర్‌ను కూడా నిర్వహించనుంది. మూడేళ్లపాటు మాస్టర్‌ డేటా మేనేజ్‌మెంట్, టైప్‌ ‘‘సి’’ లేదా మైక్రో యూఎస్‌బీ టూ మైక్రో యూఎస్‌బీ కన్వెర్టర్, టెంపర్డ్‌ గ్లాస్, బాక్‌ కవర్, మూడేళ్ల వరకు మెయింటినెన్స్, వాకిన్‌ సపోర్ట్‌ కూడా అందించబోతోంది.First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>