ఏపీలో ఏప్రిల్ నుంచి... అన్నిజిల్లాల్లో సన్నబియ్యం పంపిణీ

టీడీపీ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Updated: December 3, 2019, 6:52 AM IST
ఏపీలో ఏప్రిల్ నుంచి... అన్నిజిల్లాల్లో సన్నబియ్యం పంపిణీ
ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్ తాజాగా ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇక నుంచి అన్ని జిల్లాలకు వర్తింపచేయనున్నారు. నాణ్యమైన ప్యాకెజడ్ బియ్యం పంపిణీపై సోమవారం జగన్ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కూడా హాజరయ్యారు. ఏపీలో నాణ్యమైన బియ్యం పంపిణీకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు, మంత్రి జగన్‌కు తెలిపారు. దీంతో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వర్తింపచేయాలని సీఎం నిర్ణయించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు.

మరోవైపు ఇప్పటికే ఏపీలో ప్రతిపక్షాలు సన్నబియ్యం పంపిణీపై మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు ఎక్కడా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడం లేదని అధికార పార్టీని ... టీడీపీ ప్రశ్నించింది. దీంతో జగన్ టీడీపీ చేస్తున్న ఆరోపణలు ధీటుగానే జవాబు ఇచ్చేందుకు... త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ జరగాలని అధికారుల్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>