ఏపీలో ఈనెల 20 నుంచి రేషన్, పెన్షన్ లబ్దిదారుల ఎంపిక

గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఈ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.

news18-telugu
Updated: November 12, 2019, 2:14 PM IST
ఏపీలో ఈనెల 20 నుంచి రేషన్, పెన్షన్ లబ్దిదారుల ఎంపిక
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల అంటే నవంబర్‌ 20 నుంచి బియ్యంకార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజురియింబర్స్‌ మెంట్‌ లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు అధికారులు. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 20వ వరకూ ఈ ఎంపిక ప్రక్రియ జరగనుంది. దీనికి సంబంధించి కొత్త కార్డుల జారీ కానున్నాయి. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ఈ పని పూర్తిచేయనున్నారు. అలాగే వైయస్సార్‌ సున్నా వడ్డీ, నేతన్న నేస్తం, అమ్మ ఒడి, నాయీ బ్రాహన్మణులకు నగదు, వైయస్సార్‌ కాపు నేస్తం, గ్రామాల్లోని దేవాలయాలు, చర్చిలు, మసీదులు.. సహా ఇతర పథకాలకు లబ్ధిదారుల ఎంపికపై మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు.
గ్రామ సచివాలయంలో పర్మినెంట్‌గా డిస్‌ ప్లే బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ పథకాలకు అర్హులైన వారి జాబితాను అక్కడ ఉంచాలని అధికారులు ఆదేశించారు. అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేయాలి? ఎవరికి చేయాలన్న సమాచారాని కూడా దాంట్లో పొందుపరిచేలా చర్యలు తీసుకున్నారు.

First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు