Home /News /politics /

AP GOVT PLANS TO OPEN YSR CANTEENS AND SHUTS DOWN ANNA CANTEENS SB

ఏపీలో ఇకనుంచి వైఎస్ఆర్ క్యాంటిన్లు... అక్టోబర్ 2 నుంచి ప్రారంభం

ఏపీలో ఇకనుంచి వైఎస్ఆర్ క్యాంటిన్లు... అక్టోబర్ 2 నుంచి ప్రారంభం

ఏపీలో ఇకనుంచి వైఎస్ఆర్ క్యాంటిన్లు... అక్టోబర్ 2 నుంచి ప్రారంభం

అన్ని పాత క్యాంటీన్లనూ తిరిగి ప్రారంభిస్తారా? లేక కొన్ని మూసివేస్తారా? అన్న విషయమై ఇంకా స్పష్టత రావాల్సివుంది.

    ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రభుత్వం మూసేసిన  "అన్నాక్యాంటీన్లు"  వైఎస్సార్ పేరుతో అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. జులై 31న  రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసిన సంగతి  తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, ముఖ్యమైన పట్టణాల్లో అన్న క్యాంటీన్లను  గతంలోని చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసింది. 5 రూపాయలకే పేదవారికి ఈ క్యాంటీన్లలో భోజనం  లభించేది. వీటి మూసివేత వలన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కాగా, పునరాలోచనలో పడిన ప్రభుత్వం తిరిగి వీటిని తెరిపించాలని నిర్ణయించుకుంది.

    అక్టోబర్ 2 నుంచి క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని అక్షయపాత్ర ప్రతినిధులకు ఆదేశాలు అందాయి.  ఇక అన్ని పాత క్యాంటీన్లనూ తిరిగి ప్రారంభిస్తారా? లేక కొన్ని మూసివేస్తారా? అన్న విషయమై స్పష్టత రావాల్సివుంది. అయితే గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు అన్నా క్యాంటిన్లు మూసివేతపై ఆందోళనకు దిగారు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్లను ప్రభుత్వం మూసివేయడం దారుణమంటూ ఆరోపించారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: Andhra Pradesh, Anna canteen, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, YSR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు