జగన్‌కు బిగ్ షాక్ తప్పదా? హైకోర్టు తరలింపు అసలు సాధ్యమేనా?

ఈ అంశంలో కేంద్రానికి కొన్ని పరిమితులు ఉంటాయని.. హైకోర్టు తరలింపునకు సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర న్యాయశాఖ అనుమతి తప్పనసరి ఉండాలని అన్నారు.


Updated: January 21, 2020, 7:43 PM IST
జగన్‌కు బిగ్ షాక్ తప్పదా? హైకోర్టు తరలింపు అసలు సాధ్యమేనా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పుడు ఎక్కడ చూసినా ఏపీలో మూడు రాజధానులు అంశంపైనే చర్చలు జరుగుతోంది. పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించడాన్ని కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో హైకోర్టు తరలింపుపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్ననప్పటికీ.. హైకోర్టు తరలింపు అంశం మాత్రం కేంద్ర పరిధిలో ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్రం అనుమతి లేనిదే హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం తరలించలేదని తెగేసి చెప్పారు జీవీఎల్.

ఓ టీవీ ఛానెల్ లైవ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కాదన్న జీవీఎల్.. హైకోర్టు తరలింపు ప్రక్రియ రాజధానిని తరలించినంత ఈజీ కాదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంలో కేంద్రానికి కొన్ని పరిమితులు ఉంటాయని.. హైకోర్టు తరలింపునకు సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర న్యాయశాఖ అనుమతి తప్పనసరి ఉండాలని అన్నారు. ఐతే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు తమ రాజకీయ డిమాండ్ అని స్పష్టం చేశారు జీవీఎల్. ఈ క్రమంలో హైకోర్టు తరలింపు వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

GVL Narasimha Rao on Jana Sena BJP meeting
జీవీఎల్ నరసింహారావు
Published by: Shiva Kumar Addula
First published: January 21, 2020, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading