దేవాలయాల్లో రిజర్వేషన్.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Reservations in AP | మొత్తం నామినేటెడ్ సభ్యుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది

news18-telugu
Updated: September 14, 2019, 9:09 AM IST
దేవాలయాల్లో రిజర్వేషన్.. జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సీఎం జగన్, తిరుమల ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందు ధార్మిక సంస్థల నియామక చట్టం లో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టు ల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం నామినేటెడ్ సభ్యుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వంద రోజుల పాలనలో పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో ఇది కూడా ఒకటి. గతంలో ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవులు (కార్పొరేషన్లు, వివిధ ట్రస్ట్ బోర్డులు, వ్యవసాయ మార్కెట్లు), కాంట్రాక్టుల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు
50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్‌లో తీర్మానించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించింది.

తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకమండలి సభ్యులను 16 నుంచి 25కి పెంచుతూ  ఇటీవలే కేబినెట్‌లో ఆమోదం తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యులు మరో నలుగురు ఉంటారు. అయితే ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం టీటీడీకి మాత్రం వర్తించదు.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు