తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ

ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసేందుకు కార్యదర్శులకు అధికారం కల్పించింది.

news18-telugu
Updated: October 30, 2019, 6:20 PM IST
తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
తప్పుడు వార్తలపై ఉక్కుపాదం మోపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫేక్ న్యూస్ సృష్టించినా.. వాటిని షేర్ చేసినా ఇకపై కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. నిరాధార వార్తలు రాసినా, ప్రచురించినా, ప్రసారం చేసినా, సామాజిక మాధ్యమాల్లో ఉంచినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయా శాఖల కార్యదర్శులకు అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తలు రాస్తే ఇకపై పరువు నష్టం కింద నోటీసులు జారీ చేసేందుకు కార్యదర్శులకు అధికారం కల్పించింది.

ప్రస్తుతంం పలు మీడియా సంస్థలు పనిగట్టుకొని మరీ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు కథనాలను ప్రసారం, ప్రచురణ చేస్తున్నారని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్దేశపూర్వక కథనాలను రూపొందిస్తున్నారని జగన్ దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తప్పుడు వార్తలను కట్టడి చేసి..ఆయా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, కాంట్రాక్టులకు సంబంధించి తప్పుడు వార్తా కథనాలు రాసే మీడియా హౌస్‌లపై చర్యలు తీసుకోవాలని.. ఆయా శాఖలపై వచ్చే కథనాలపై కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం ఆదేశించింది.

జీవో కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
First published: October 30, 2019, 6:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading