గోదావరిలో బోటు తీసిన ధర్మాడి సత్యానికి.. YSR లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్

సాంకేతికతో సాధ్యం కానిదానిని ధర్మాడి సత్యం స్వశక్తితో సాధించారని పలువురు ఇప్పటికే ధర్మాడి సత్యాన్ని అభినందించారు.

news18-telugu
Updated: October 31, 2019, 3:16 PM IST
గోదావరిలో బోటు తీసిన ధర్మాడి సత్యానికి.. YSR లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్
గోదావరిలో బయటకు తీసిన బోటు
  • Share this:
గోదావరిలో ప్రమాదానికి గురై మునిగి రాయల్ వశిష్ట బోటును తీసిన ధర్మాడి సత్యానికి అరుదైన గౌరవం లభించింది. ఏపీ ప్రభుత్వం ఆయనను వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చి సత్కరించింది. కచ్చలూరు వద్ద మునిగిన రాయల్ వశిష్ట బోటును తీసేందుకు రోజుల పాటు...ధర్మాడి సత్యం టీం శ్రమించింది. దీంతో ఆయనకు తొలి YSR లైఫ్ టైమ్ అవార్డును అందించింది జగన్ సర్కార్.సాంకేతికతో సాధ్యం కానిదానిని ధర్మాడి సత్యం స్వశక్తితో సాధించారని పలువురు ఇప్పటికే ధర్మాడి సత్యాన్ని అభినందించారు.

సెప్టెంబరు 15న తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు సమీపంలో గోదావరి నదిలో పర్యాటకుల బోటు రాయల్ వశిష్ట మునిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఆ తర్వాత మృతదేహాల కోసం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్ సిబ్బంది గాలించారు. ఇక ప్రమాదం జరిగిన 15 రోజుల తర్వాత బోటు కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సెప్టెంబరు 30న రాయల్ వశిష్ట కోసం కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం టీమ్ రంగంలోకి దిగింది. ఈ ఆపరేషన్ రెండు విడతల్లో ఆ ఆపరేషన్ జరిగింది. వర్షాలు, వరదల కారణంగా తొలి ఆపరేషన్‌కు ఆటంకాలు కలిగాయి. ఎలాంటి ఫలితం లేకుండానే మొదటి ఆపరేషన్ ముగిసింది.

ఇక ఇటీీవల ఎగువన వర్షాలు తగ్గడంతో గోదావరి నది ప్రవాహ ఉద్ధృతి కూడా తగ్గుముఖం పట్టింది. దాంతో ఈ నెల 16న మరోసారి ప్రయత్నాలను ప్రారంభించింది ధర్మాడి సత్యం బృందం. పెద్ద లంగర్లు, తాళ్లు వేసి బోటును పైకి తీసేందుకు ప్రయత్నించారు. బోటులో బోటులో ఇసుక, మట్టి పెద్దమొత్తంలో పేరుకుపోవడంతో బోటు ఒకేసారి బయటకు రాలేకపోయింది. ఇక ఓం శివశక్తి అండర్‌వాటర్ సర్వీసెస్‌(విశాఖపట్నం)కు చెందిన ఇద్దరు డైవర్లు ఆదివారం ఉదయం నదిలో మునిగి బోటుకు భారీ తాళ్లు కట్టి పైగి లాగారు. ఐతే మొదట రెయిలింగ్, ఆ తర్వాత పైకప్పుడు మాత్రం బయటపడ్డాయి. సోమవారం మరోసారి నీటి అడుగుభాగానికి వెళ్లి తాళ్లు కట్టి బోను పైకి తీసుకొచ్చారు.First published: October 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...