పోలీసులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... 20 ఏళ్ల తర్వాత తొలిసారి..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు శాఖకు తీపికబురు అందించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.

news18-telugu
Updated: December 4, 2019, 4:26 PM IST
పోలీసులకు సీఎం జగన్ గుడ్ న్యూస్... 20 ఏళ్ల తర్వాత తొలిసారి..
పోలీసు అధికారులతో సీఎం జగన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలీసు శాఖకు తీపికబురు అందించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పోలీసులకు ప్రమాదాల సమయంలో అందించే గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీని పెంచారు. ఈ మేరకు యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియాకు చెక్కును అందజేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర పోలీసు అధికారుల సమక్షంలో చెక్కును కంపెనీకి అందించారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వం, పోలీసు శాఖ కలిపి రూ.4.74 కోట్ల చెక్కును అందజేశారు. సుమారు 20 ఏళ్ల తర్వాత పోలీసులకు గ్రూప్ ఇన్సూరెన్స్ మొత్తం పెరుగుతోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.

గతంలో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు రూ.13లక్షలు ఇన్సూరెన్స్ ఉండేది. అయితే, ఇప్పుడది రూ.20లక్షలకు పెరుగుతుంది. ఇది గ్రూప్ ఇన్సూరెన్స్. ప్రమాదాలు జరిగినప్పుడు పనికొస్తుంది. అలాగే, ఎస్ఐ, సీఐలకు రూ.35లక్షలు, డీఎస్పీ, ఆ పై అధికారులకు రూ.45లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రాష్ట్రంలోని 64,719 పోలీసు కుటుంబాలు లబ్ధి పొందనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. మరోవైపు పోలీసులు సహజమరణం చెందితే వారి కుటుంబానికి రూ.30లక్షల పరిహారం ఇస్తారు. ఒకవేళ టెర్రరిస్టుల దాడిలో మరణిస్తే రూ.40లక్షల పరిహారం లభిస్తుంది.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>