news18-telugu
Updated: December 13, 2019, 5:19 PM IST
ఈ క్రమంలోనే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్డీయేను రద్దు చేసి.. ఆ స్థానంలోనే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తారని పుకార్లు షికారు చేశాయి. అమరావతి అంశంపై నిపుణుల కమిటీని నియమించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరించింది. నిపుణుల కమిటీ నివేదికలో ఏముంది? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఏపీ రాజధానిపై శాసనమండలిలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
శుక్రవారం శాసన మండలిలో ఏపీ రాజధానిపై టీడీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నలు అడిగారు. రాజధానిని మార్చే ఉద్దేశం ఉందా? అమరావతి కోసం ఇప్పటి వరకు ఖర్చుచేసిన నిధుల వివరాలేంటి? అని ప్రశ్నించడంతో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాత పూర్వక సమాధానం చెప్పారు. 'లేదండి'.. అని తన సమాధాన పత్రంలో పేర్కొన్నారు మంత్రి బొత్స. దీన్ని బట్టి ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లయింది. అమరావతి నుంచి రాజధానిని తరలించే ఉద్దేశం లేదని చెప్పినట్లయింది.

బొత్స సమాధానం
Published by:
Shiva Kumar Addula
First published:
December 13, 2019, 4:46 PM IST