AP GOVT EMPLOYEES FEDERATION CHAIRMAN VENKATRAMI REDDY DEMANDS RS 50 LAKHS COMPENSATION IF ANYONE DIES DURING ELECTION DUTY BA
AP Panchayat elections: ఎన్నికల విధులకు రెడీ.. కానీ.. ఉద్యోగ సంఘాల భారీ డిమాండ్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయింది. ఈ క్రమంలో కరోనా పేరుతో ఎన్నికల విధులను చేయబోమంటున్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు డ్యూటీ చేయక తప్పని పరిస్థితి.
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అయింది. ఈ క్రమంలో కరోనా పేరుతో ఎన్నికల విధులను చేయబోమంటున్న ఉద్యోగ సంఘాలు ఇప్పుడు డ్యూటీ చేయక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో ఒకవేళ ఎన్నికల విధుల్లో ఎవరైనా ఉద్యోగులు కరోనాతో మరణిస్తే అనే ప్రశ్నను లేవనెత్తారు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి. ఎన్నికల విధుల్లో కరోనాతో ఉద్యోగి మరణిస్తే రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరగలేదన్న వెంకట్రామిరెడ్డి, కోర్టు తీర్పును గౌరవిస్తూ ఎన్నికల విధుల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌ను కలిసి తమ సమస్యలను వివరిస్తామన్న ఆయన.. 50 ఏళ్లు దాటిన వారికి ఎన్నికల విధులు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తామన్నారు. ఉద్యోగ సంఘాలపై కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగులతో వైరం మంచిది కాదన్న వెంకట్రామిరెడ్డి... ఎన్నికల సంఘమే తమకు వివాదంలోకి లాగిందన్నారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుబట్టగా, తాము చెయ్యబోమంటూ ఉద్యోగులు ఎదురుతిరిగారు. తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించారు. దానికి ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించారు. అయితే, సుప్రీంకోర్టు కూడా ఏపీలో పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు కూడా దిగిరాక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే, ఇప్పుడు ఉద్యోగులు ఎన్నికల విధులకు రెడీ అవుతూనే ఇప్పుడు కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు.
ఏపీలో పంచాయతీ ఎన్నికల రీషెడ్యూల్
ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక ఆదేశాలిచ్చారు. పంచాయతీ ఎన్నికలను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. మెదటి దశను నాలుగో దశగా, రెండో దశ ఎన్నికలను మొదటి దశకు మార్చారు. అలాగే మూడో దశను రెండో దశకు మార్చారు. నాలుగో దశను మూడో దశకు మార్చిన ఎస్ఈసీ.. మొదటి దశను నాలుగో దశకు రీషెడ్యూల్ చేశారు. రీ షెడ్యూల్ చేసిన ప్రకారం మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఈనెల 29కి వాయిదా వేశారు. నిమ్మగడ్డ రిలీజ్ చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 9, 13,17,21 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కాకపోవడమే రీ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.