ఆగని జగన్ దూకుడు... ఏపీలో మరో విదేశీ సంస్థ ప్రాజెక్టు రద్దు

ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపుగా 7000 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తుందని భావించామన్నారు. తమ సంస్థ చాలా పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియలో కూడా పాల్గొందన్నారు సంస్థ డైరెక్టర్.

news18-telugu
Updated: November 20, 2019, 2:55 PM IST
ఆగని జగన్ దూకుడు... ఏపీలో మరో విదేశీ సంస్థ ప్రాజెక్టు రద్దు
ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ రాజధానిలో సింగపూర్ ప్రాజెక్టుకు రద్దు చేసిన పదిరోజుల తిరగ్గకుండానే జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దుబాయ్ కంపెనీలతో గత ప్రభుత్వం చేసుకున్న మరో వ్యాపారపరమైన ఒప్పందాల్ని రద్దు చేశారు. గల్ఫ్ దేశాలకు చెందిన లులు గ్రూప్‌కు గత సీఎం చంద్రబాబు విశాఖలో భూములు కేటాయించారు.అయితే తాజాగా ఆ భూముల్ని రద్దు చేసినట్లు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. దీంతో ఏపీలో పెట్టుబడులపై పెట్టకుండా లాలూ గ్రూప్ వెనక్కి తగ్గింది. ఈ మేరకు లులు గ్రూప్ డైరెక్టర్ అనంత్ రామ్ ప్రకటన కూడా చేశారు. ఏపీ ప్రభుత్వం తమ సంస్థకు ఇచ్చిన భూమిని రద్దు చేసిందన్నారు.

గల్ఫ్‌కు చెందిన మా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, షాపింగ్ మాల్, ఫైవ్ స్టార్ హోటల్స్‌తో విశాఖను కన్వెన్షన్ అండ్ షాపింగ్ హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేసేందుకు.. ఆ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 2200 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల దాదాపుగా 7000 మందికి పైగా స్థానిక యువతకు
ఉపాధి కల్పిస్తుందని భావించామన్నారు. తమ సంస్థ చాలా పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియలో కూడా పాల్గొందన్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ కోసం భూమిని లీజుకు తీసుకున్నామన్నారు.

అంతర్జాతీయంగా ప్రఖ్యాత కన్సల్టెంట్లను నియమించమన్నారు. ప్రపంచ స్థాయి వాస్తు శిల్పులచే ప్రాజెక్ట్ రూపకల్పనకు ఇప్పటికే తమ సంస్థ భారీ ఖర్చులు కూడా చేసిందన్నారు. చేసినప్పటికీ, కొత్త ప్రభుత్వ నిర్ణయానికి మేము అంగీకరిస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భూ కేటాయింపులను ఉపసంహరించుకునేందుకు ఇకపై ఏపీలో ఎలాంటి కొత్త ప్రాజెక్టుకు పెట్టుబడులు పెట్టమన్నారు. మరోవైపు తెలంగాణ, తమిళనాడు,కేరళ, ఉత్తర్ ప్రదేశ్‌లో తమ సంస్థ పెట్టుబడులు పెడుతుందన్నారు డైరెక్టర్ అనంతరామ్.

First published: November 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com