ఏపీ మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు

మార్కెట్లో నిత్యావసరాల సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో వంట ఏజెన్సీలకు ఇచ్చే నిధులు కూడా పెంచింది జగన్ సర్కార్.

news18-telugu
Updated: January 12, 2020, 7:01 AM IST
ఏపీ మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టి ఆరునెలలు పూర్తయ్యింది. ఈ కాలంలో ఆయన ఎన్నో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనేక కొత్త పథకాల్ని సైతం ప్రారంభించారు. తాజాగా ఆయన మరో తాజా నిర్ణయం తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంలోని మెనూలో మార్పులు చేశారు. వీటికోసం 200 కోట్ల రూపాయులు విడుదల చేశారు. జనవరి 21 నుంచి ఈ కొత్త మెనూ అమల్లోకి రానుంది.

మారిన మెనూ వివరాలు చూస్తే..

సోమవారం - అన్నం, పప్పుచారు, గుడ్డు కూర

మంగళవారం -పులిహోర, టమాటా, పప్పు, గుడ్డు


బుధవారం - వెజిటేబుల్ రైస్, ఆలుకూర, గుడ్డు
గురువారం - కిచిడీ, టమాటా చట్నీ, గుడ్డు
శుక్రవారం - అన్నం, ఆకుకూర పప్పు, గుడ్డుశనివారం - అన్నం సాంబర్ , పొంగలి

ఇక వీటితో పాటు మధ్యాహ్న భోజనం అమలు కోసం ఏజెన్సీలకు ఇచ్చే నిధులు కూడా పెంచింది. 1 నుంచి 7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.4.23 ఇచ్చేవారు. ఇకపై రూ4.48 చెల్లిస్తారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులకు రూ.6.48 నుంచి రూ 6.71 పైసలకు పెంచారు. మార్కెట్లో నిత్యావసరాల సరుకులు ధరలు పెరిగిన నేపథ్యంలో వంట ఏజెన్సీలకు ఊరట లభించింది. ఇప్పటికే వంట ఏజెన్సీల గౌరవ వేతనాన్ని కూడా ప్రభుత్వం పెంచింది. మిడ్ డే మీల్స్ కోసం కుక్‌లు, అసిస్టెంట్‌ కుక్‌లు పనిచేస్తున్నారు. గతంలో వీరికి నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనం చెల్లించేవారు. ప్రభుత్వం రూ.3 వేలకు పెంచింది. 2019 ఆగస్టు నెల నుంచి ఈ మొత్తం అమల్లోకి వచ్చింది.
First published: January 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు