ఏపీలో బీసీలకు దీపావళి ముందే వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యేలు

ఏపీలో 56 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంతోపాటు 672 మంది డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: October 18, 2020, 7:48 PM IST
ఏపీలో బీసీలకు దీపావళి ముందే వచ్చింది: వైసీపీ ఎమ్మెల్యేలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు ముందే దీపావళి పండుగ వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఏపీలో బీసీలు బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని అన్నారు. ఏపీలో 56 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించడంతోపాటు 672 మంది డైరెక్టర్లను నియామకం చేస్తున్న ఈ పరిస్ధితుల్లో సీఎం వైఎస్ జగన్‌కు మనస్పూర్తిగా సలాం చేస్తున్నామన్నారు. ‘దేశచరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం ఇది. ఏపీలో మన ముఖ్యమంత్రి, వైఎస్‌ జగన్‌ బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు. ఎన్నికల ముందు చెప్పిన విధంగా బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా నిలబెడతానన్నారు. ఈ మాటను అక్షరాల నిలబెడుతూ 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి 56 మంది ఛైర్మన్లను నియమిస్తూ ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి ఏపీలోని బలహీనవర్గాల ప్రజలంతా జగన్‌‌కు జేజేలు పలుకుతున్నారు. ఏలూరు బీసీ గర్జనలో జగన్ ఒక మాట చెప్పారు, బీసీలంటే తల ఎత్తుకు తిరిగేలా చేస్తానన్న మాట ఈ రోజు నెరవేర్చారు. ఇది బీసీలకు పండుగ వాతావరణం. జగన్ సీఎం అయిన తర్వాత బీసీలకు 2,71,37,253 మంది లబ్దిదారులకు, రూ. 33,500 కోట్ల బలహీనవర్గాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా పడ్డాయి.’ అని ఎమ్మెల్యేలు తెలిపారు.

బీసీలు ఓటు బ్యాంక్‌ అని చెప్పుకుని.. ఇన్నేళ్ళూ బీసీలను వాడుకుని గద్దెనెక్కిన టీడీపీకి బీసీలంతా కూడా గత ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. జగన్ మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులతోపాటు నామినేటెడ్‌ పదవుల్లో, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ పదవులు ఇచ్చారని తెలిపారు. ఎంతోమంది దేవాలయాల ఛైర్మన్లు, డైరెక్టర్లు అయ్యారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్పొరేషన్లలో బీసీలకు సముచిత ప్రాధాన్యమిస్తాం, ఈ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

రాష్ట్ర ఖజానాను టీడీపీ గుల్ల చేసి అప్పగించినా, ఇన్ని పథకాలు ఎలా అమలుచేస్తున్నారా అని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు, ఎలా సాధ్యమవుతుందని ఆరా తీస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు అన్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ చిరస్ధాయిగా నిలిచిపోతారు, ఆయన బీసీల గుండెల్లో నిలిచిపోతారని అభివర్ణించారు. జగన్‌ సీఎంగా భాద్యతలు చేపట్టినటువంటి రోజు నుంచి ప్రతీ పథకం, ప్రతీ కార్యక్రమం, అందరికీ అందజేస్తూ వారి కుటుంబాల్లో వెలుగులు నింపారన్నారు.

‘ఈ రోజు టీడీపీ అడ్రస్‌ గల్లంతయింది, బీసీలకు కార్పొరేషన్ల ఏర్పాటుతో ఒక పండుగ వాతావరణం నెలకొనడంతోపాటు.. బీసీలంతా జగన్‌రి వెంట ఎప్పటికీ ఉండాలని నిర్ణయించుకున్నారు. బలహీనవర్గాల ప్రజలంతా ఈ రోజు ప్రతీచోటా ఇదే చర్చిస్తున్నారు. జగన్‌ తీసుకున్న నిర్ణయానికి మనమంతా జేజేలు పలుకుదాం.’ అని వైసీపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.

బీసీలకు పెద్ద పీట వేస్తున్నారనడానికి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు ఇద్దరికీ ఎమ్మెల్సీలు ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. ఇవ్వడమే కాదు మళ్ళీ అవి రద్దవుతాయని వారిద్దరినీ రాజ్యసభకు పంపారన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 18, 2020, 7:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading