Home /News /politics /

AP GOVERNOR GREEN SIGNAL TO TWO DEPUTY MAYORS ORDINANCE GNT NGS

Andhra Pradesh: జగన్ ప్రతిపాదన.. గవర్నర్ ఆమోదం.. ఇకపై మున్సిపాలిటీల్లో ఇద్దరు చొప్పున..

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ (ఫైల్)

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ (ఫైల్)

ఏపీ వ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇకపై ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ చైర్ పర్సన్లు ఉంటారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో మేయర్ ఎన్నిక రోజే ఇద్దరు డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఏపీ సీఎం జగన్ పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్పొరేషన్లు, మున్సిపాలీటీల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం కార్పొరేషన్లను వైసీపీ సొంతం చేసుకోగా.. రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే టీడీపీ అత్యధిక సీట్లు సాధించింది. కానీ అక్కడ కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వైసీపీనే చైర్మన్లను నెగ్గించుకునే పరిస్థితి కనిపిస్తోంది.

    ఘన విజయం సాధించిన ఉత్సాహంపై మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇకపై అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైఎస్ చైర్మన్లు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటిపై న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా.. ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. ఇద్దరు డిప్యూటీ మేయర్ లు, వైస్ చైర్మన్ ల ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై ఏపీ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇది అమల్లోకి రానుంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా మేయర్ల ఎంపిక జరగనుంది. ఈ లోపే ఆర్డినెన్స్ కు ఆమోదం లభించడంతో ఇకపై అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ల ఫార్ములా అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది.

    ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లోనూ ఇదే ఫార్ములా కొనసాగుతుంది. ఇప్పటికే సామాజిక సమీకరణాలతో ఐదుగురు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పించారు సీఎం జగన్. ఇప్పుడు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ అదే ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మున్సిపాలిటీల విషయాలకు వస్తే.. ప్రతిపక్షం కేవలం రెండు చోట్ల గెలుపొందింది. మిగిలినవన్నీ వైసీపీ ఖాతాలోనే చేరాయి. మైదుకూరు, తాడిపత్రిల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఖాతాలో చేరాయి. అయితే ఆ రెండు చోట్ల కూడా ఎక్స్ అఫిషియో సభ్యుల బలంతో చైర్మన్ గిరిని సొంతం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది. దీంతో ఆ రెండు చోట్ల క్యాంపు కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

    వైసీపీ గెలిచిన అన్ని చోట్లా బారీ మెజార్టీనే సాధించింది. ఎక్కడా ప్రతిపక్షాలు పోటీ కూడా ఇవ్వలేదు. దీంతో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల పదవికి విపరీతమైన పోటీ ఉంది. దీంతో కొంతమంది అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నంటినీ బేరీజు వేసుకునే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎంపికతో సమాజిక వర్గాల లెక్కన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందని.. అలాగే అందరికీ సమ న్యాయం చేసే పరిస్థితి ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.  ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. ప్రభుత్వం ఫార్ములాను త్వరగానే అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాధరణంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయి. కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎక్కడా ప్రభావం చూపలేకపోయాయి. దీంతో ఎవరూ విమర్శించే ప్రయత్నం కూడా చేయడం లేదు.

    గురువారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు ఉండడంతో..  ముందుగా ఒక్కొక్కరితో ప్రమాణ స్వీకారాలు చేయించి.. తరువాత మరో అభ్యర్థితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఒక రోజు సమయం ఉంది కాబట్టి..  ప్రమాణ స్వీకారానికి ముందే ఇద్దరు అభ్యర్థులను అధిష్టానం ఎంపిక చేస్తుందో చూడాలి.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Governor, Ap local body elections, AP News, AP Politics, Municipal Elections

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు