Home /News /politics /

విక్టరీ సింబల్ చూపిస్తూ చంద్రబాబు దొరికిపోయారు: వైసీపీ

విక్టరీ సింబల్ చూపిస్తూ చంద్రబాబు దొరికిపోయారు: వైసీపీ

చంద్రబాబు, శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు, శ్రీకాంత్ రెడ్డి

ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నాలుగునెలల్లోనే అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిదన్నారు.

    ఏపీ మాజీ ముఖ్యమంత్రిపై ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చంద్రబాబు ఓర్వలేని తనమన్నారు. ఎన్నికలు వస్తున్నాయని 2 నెలలముందు ఓట్లకోసం పధకాలు తెచ్చిన చరిత్ర చంద్రబాబుదంటూ మండిపడ్డారు. ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నాలుగునెలల్లోనే అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిదన్నారు. మీ నిర్వాహకం వల్ల జరిగిన కోడెల ఆత్మహత్యను సైతం రాజకీయం చేసే క్రమంలో విక్టరీ సింబల్ చూపిస్తు దొరికిపోయారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.

    ఆటోడ్రైవర్లకు ఏ ప్రదేశంలో పదివేలు ఇస్తానని వాగ్దానం చేశారో సీఎం జగన్ అదే ప్రదేశంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారన్నారు శ్రీకాంత్ రెడ్డి. వాహనమిత్ర పధకాన్ని సైతం సిగ్గులేకుండా విమర్శిస్తున్నారన్నారు. పధకాలలో లోపాలు ఉంటే చెప్పాలన్నారు. అంతేగాని ప్రతివిషయంపై చంద్రబాబు బురదచల్ లేకార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలో వందలాది దేవాలయాలను కూలగొట్టి కనకదుర్గ,శ్రీకాళహస్తి ఆలయాలలో క్షుద్రపూజలు చేయించిన నైజం చంద్రబాబుదన్నారు. రైతులను,నిరుద్యోగులను,డ్వాక్రామహిళలను ఇలా అందర్ని మోసం చేశారన్నారు.



    First published:

    Tags: Andhra Pradesh, AP Chief Whip Srikanth Reddy, AP News, AP Politics, Chandrababu naidu, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు