ఏపీలో మరో కొత్త పథకం.. వైఎస్‌ఆర్ జయంతి రోజున ప్రారంభం..

వైఎస్ఆర్, వైఎస్ జగన్ ఫైల్

AP CM YS Jagan : ఏపీలో మరో కొత్త పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ‘డాక్టర్ వైఎస్‌ఆర్ చిరునవ్వు’ పేరిట ఒకటో తరగతి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యం అందించనున్నారు.

  • Share this:
    ఏపీలో మరో కొత్త పథకానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ‘డాక్టర్ వైఎస్‌ఆర్ చిరునవ్వు’ పేరిట ఒకటో తరగతి నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యం అందించనున్నారు. ఈ పథకంలో భాగంగా.. ప్రతి విద్యార్థికి ఉచితంగా టూత్‌పేస్ట్, బ్రష్‌ అందించనున్నారు. వీరికి పీహెచ్‌సీలలో డెంటల్ చెకప్ చేయనున్నారు. 60 లక్షల మంది చిన్నారులకు స్క్రీనింగ్‌ చేయడమే లక్ష్యంగా ఏపీ సర్కారు ముందుకు సాగుతోంది. ఈ పథకంపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు పూర్తిగా అధ్యయనం చేయాలని, కంటివెలుగు తరహాలో కార్యక్రమం సజావుగా సాగేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా జూలై 8న పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

    కాగా, కంటివెలుగు కార్యక్రమంపైనా జగన్ సమీక్ష నిర్వహించారు. ఆ పథకంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని అన్నారు. అవ్వా తాతలకు కళ్లద్దాలు ఇస్తున్నారా? అని అధికారులను ఆరా తీశారు. పథకాన్ని మరింత సమర్థవంతంగా చేపట్టాలని చెప్పారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: