AP GOVERNMENT TO OPERATE 503 WINE SHOP LIQUOR OUTLETS IN AP FROM TODAY SK
రాత్రి 9 వరకే వైన్ షాప్లు.. నేటినుంచే అమలు.. కొత్త నిబంధనలు ఇవే
ప్రతీకాత్మకచిత్రం
ఇప్పటికే ఐఎంఎల్ డిపోల నుంచి మద్యాన్ని, పోస్టర్లను, ఇతర సామాగ్రిని మద్యం షాపులకు తరలించారు. కొత్త నిబంధనలను సంబంధించిన పోస్టర్లను ఆయా షాపులకు అంటించారు.
ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని ప్రకటించిన సీఎం జగన్.. ఆ దిశగా చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే కొత్త మద్యం పాలసీ ప్రకటించడంతో పాటు అక్టోబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయించారు. పైలెట్ ప్రాజెక్టుగా ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 503 మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అందకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే ఐఎంఎల్ డిపోల నుంచి మద్యాన్ని, పోస్టర్లను, ఇతర సామాగ్రిని మద్యం షాపులకు తరలించారు. కొత్త నిబంధనలను సంబంధించిన పోస్టర్లను ఆయా షాపులకు అంటించారు.
కొత్త నిబంధనలు ఇవే:
ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో షాపులకు పర్మిట్ రూమ్స్, లూజ్ సేల్స్ నిషేధం.
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే సిబ్బందిపై చర్యలు తప్పవు.
ఒక వ్యక్తికి గరిష్ఠంగా మూడు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యాన్ని అమ్మడానికి వీల్లేదు.
ఎవరి వద్దననా 3 బాటిళ్లకు మించి ఎక్కువ దొరికితే వారిపై కేసులు నమోదు.
ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా ప్రభుత్వ వైన్ షాప్స్లో మద్యం అమ్మకాలు.
అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో మద్యం షాపులను నిర్వహణ.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.