అమరావతి మున్సిపల్ కార్పొరేషన్.. జగన్ మరో కీలక నిర్ణయం

రాజధాని పరిధిలోని గ్రామాలను శాంతింపజేసేందుకు అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాజధాని ప్రాంతంలో కొత్తగా మూడు గ్రామాలు (పెదపరిమి, వడ్డెమాను, హరిశ్చంద్రపురం) కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు మొదలు పెట్టారు.


Updated: January 24, 2020, 9:44 PM IST
అమరావతి మున్సిపల్ కార్పొరేషన్.. జగన్ మరో కీలక నిర్ణయం
వైఎస్ జగన్
  • Share this:
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటును అమరావతి రైతులు తీవ్రంగా వ్యతిరేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అమరావతిలోనే క్యాపిటల్ ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి విషయంలో సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజధాని పరిధిలోని గ్రామాలను శాంతింపజేసేందుకు అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రాజధాని ప్రాంతంలో కొత్తగా మూడు గ్రామాలు (పెదపరిమి, వడ్డెమాను, హరిశ్చంద్రపురం) కలిపి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదపరిమిలో అధికారులు గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలని అనుకున్నారు. ఐతే గ్రామకు ప్రజలు తక్కువగా హాజరుకావడంతో సోమవారానికి వాయిదా వేశారు. మున్సిపల్ కార్పొరేషన్‌లో కలిసేందుకు మూడు గ్రామాలు అంగీకరించాయని.. కానీ సీఆర్డీఏ రద్దును మాత్రం తీవ్ర వ్యతిరేకించాయని తెలుస్తోంది.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు