అమరావతిలో ఆస్తుల వేలం.. జగన్ సర్కారు కీలక నిర్ణయం..

అమరావతిలో ఆస్తుల వేలానికి జగన్ సర్కారు నిర్ణయించింది. 9 నెలల క్రితం కూల్చేసిన ప్రజా వేదిక పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ సిద్ధమైంది.

news18-telugu
Updated: February 24, 2020, 7:40 PM IST
అమరావతిలో ఆస్తుల వేలం.. జగన్ సర్కారు కీలక నిర్ణయం..
సీఎం జగన్
  • Share this:
అమరావతిలో ఆస్తుల వేలానికి జగన్ సర్కారు నిర్ణయించింది. 9 నెలల క్రితం కూల్చేసిన ప్రజా వేదిక పరికరాలను వేలం వేయాలని సీఆర్డీఏ సిద్ధమైంది. చంద్రబాబు ఇంటి పక్కనే ఉన్న ప్రజా వేదికకు అనుమతుల్లేవని, దాన్ని వెంటనే తొలగించాలని సీఎం జగన్ ఆదేశించిన మరుసటి రోజే సీఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అప్పటి నుంచి ఏసీలు, పలు పరికరాలను అలాగే ఉంచేశారు. అయితే, ఇప్పుడు ఆ పరికరాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికోసం.. మార్చి 3 లోగా వేలం పత్రాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ-వేలం ప్రారంభం అవుతుందని వెల్లడించింది.

వేలం పత్రాలను సంబంధించిన వెబ్‌సైట్.. AP CRDA

First published: February 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు