• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP GOVERNMENT SUPPORT TO INDIA BANDH ON MARCH 26TH NGS

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం : ఈ నెల 26న ఆర్టీసీ బస్సులు బంద్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం : ఈ నెల 26న ఆర్టీసీ బస్సులు బంద్

అలాగే రవాణాశాఖ మరియు సమాచార శాఖ మంత్రి మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆదాయ పన్నుగా చెల్లించాల్సిన రూ.2,91,096 కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

ఏపీలో మళ్లీ బస్సులు డిపోలకే పరిమితం అవుతున్నాయి.. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం వరకు బస్సులు డిపోకే పరిమితం అవుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటన చేశారు. కార్మిక సంఘాలకు మద్దతు కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

  • Share this:
    ఏపీలో మరోసారి బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ఈ నెల 26న మధ్యాహ్నం వరకు బస్సులను డిపోలకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా ఈ నెల 26న కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు బంద్ కు పిలుపు ఇచ్చాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పాటు దేశంలో కొత్త సాగు చట్టాలకు నిరసనగా ఈనెల 26వ తేదీన విశాఖ కార్మిక సంఘాలు పిలుపు ఇచ్చాయి. ఇప్పటికే ఈ బంద్ టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.

    విశాఖ స్టీల్ ప్లాంటును కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం తిరస్కరించిందన్నారు పేర్ని నాని. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బిడ్డింగులో పాల్గొనమని కేంద్రం సూచించిందన్నారు. ఇక ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే బీజేపీకి పట్టే పరిస్థితి వస్తుందన్నారు. ప్రత్యేక హోదా గురించి టీడీపీకి మాట్లాడే హక్కే లేదన్న ఆయన బీజేపీ చెప్పులు తుడిచే పనిలో టీడీపీ బీజీగా ఉందన్నారు. ఇసుక అక్రమాలు చంద్రబాబు హయాంలోనే ఎక్కువగా జరిగాయని, గత ప్రభుత్వంలో ఇసుక పంచాయతీలను అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సర్దుబాటు చేసేవారని విమర్శలు వచ్చాయన్నారు. ఇసుక ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా 765 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తోందని, గత ఐదేళ్ల కాలంలో ఈ మొత్తం ఎక్కడికి పోయింది..? అని ప్రశ్నించారు పేర్ని.

    భారత్ బంద్ కు వైసీపీ మద్దతు ఇవ్వడంతో.. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులు బంద్ చేస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. రైతాంగ, ఉక్కు ఉద్యమాలకు వైసీపీ మద్దతు ఉంటుందని మరోసారి మంత్రి స్పష్టం చేశారు. అయితే కార్మిక సంఘాల నిరసనలు శాంతియుతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. ఇటీవల ఏపీ బంద్ కు కూడా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. మధ్యాహ్నం వరకు బస్సు సర్వీసులను నిలిపివేసింది. దీంతో ఎక్కడిక్కడ డిపోలకే బస్సులు పరిమితం అయ్యాయి. తాజాగా మరోసారి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    అంతకుముందే ఈ భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు దేశం కార్యకర్తలు, నాయకులు భారత్ బంద్‌ లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ సహకారంతోనే పోస్కో తో ఒప్పందం కుదిరిందన్న ఆయన ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

    అటు, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బంద్ కు మద్ధతు ఇచ్చారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని ఆయన పిలుపు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ, టీడీపీలు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేయాలని కోరారు. దేశంలో ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే కచ్చితంగా అంతా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు