చంద్రబాబుకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ సర్కార్

ఇప్పటికే బాపయ్య, సందీప్ అనే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. తుళ్లూరు పోలీసు స్టేషన్ లో పెట్టిన అన్ని కేసులు సిట్ కి బదిలీ చేశారు.

news18-telugu
Updated: December 1, 2019, 1:50 PM IST
చంద్రబాబుకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ సర్కార్
చంద్రబాబు (File)
  • Share this:
చంద్రబాబు అమరావతి పర్యటన పై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గుంటూరు రురల్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ సిట్ బృందానికి ఇంచార్జ్‌గా వ్యవహరించనున్నారు. అమరావతిలో జరిగిన ఘర్షణతొ పాటు పోలీసులు అలసత్వం పై కూడా సిట్ బృందం విచారణ చేయనున్నారు. ఇప్పటికే బాపయ్య, సందీప్ అనే ఇద్దరు అరెస్ట్ అయ్యారు. తుళ్లూరు పోలీసు స్టేషన్ లో పెట్టిన అన్ని కేసులు సిట్ కి బదిలీ చేశారు.

ఇటీవల చంద్రబాబు రాజధాని పర్యటనను అమరావతిలో రైతులు అడ్డుకున్నారు. రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. వారికి తోడుగా గో బ్యాక్ చంద్రబాబు అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేపట్టారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీ వర్గీయులను హెచ్చరించారు. మరి కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి చంద్రబాబు కాన్వాయ్‌పై చెప్పులతో దాడికి దిగారు. అటు టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో తాజాగా ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం

First published: December 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>